డైరెక్టర్ శేఖర్ కమ్ములకు పితృవియోగం
ABN, First Publish Date - 2020-08-01T16:51:55+05:30
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) అనారోగ్యంతో శనివారం ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో కన్నుమూశారు.
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) అనారోగ్యంతో శనివారం ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో కన్నుమూశారు. శనివారం సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శేఖర్ కమ్ముల లాక్ డౌన్ సమయంలో కరోనా వారియర్స్‌తో మాట్లాడుతూ ప్లాస్మా దానం చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో ‘లవ్‌స్టోరి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.