ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి అభినందనలు తెలిపిన సీతక్క

ABN , First Publish Date - 2020-10-23T00:34:23+05:30 IST

ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'‌(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్ర 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్‌ కోసం అందరూ

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి అభినందనలు తెలిపిన సీతక్క

ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'‌(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్ర 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ 119వ జయంతి(అక్టోబర్‌ 22) సందర్భంగా 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేశారు. కొమురం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగుతున్న ఈ టీజర్‌లో....


''వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి..

వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ

వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..

నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్‌''

అంటూ రామ్‌చరణ్‌ చెబుతున్న డైలాగ్స్‌, ఎన్టీర్‌ నటనకు వరల్డ్‌వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది.


ఇక ఈ టీజర్‌ చూసిన వారంతా.. అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగా,నందమూరి అభిమానులైతే.. వాళ్లకి ముందే దసరా పండుగ వచ్చేసినంత ఫీలింగ్‌లో ఉన్నారు. ఇక ఈ టీజర్‌ని ట్వీట్‌ చేసి.. శుభాకాంక్షలు తెలిపారు ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకురాలు దనసరి అనసూయ అలియాస్ సీతక్క. 

''మన్యం ముద్దు బిడ్డ

మా అన్న, మా ఆదర్శం కొమం భీమ్‌గారి జయంతిన నా ఘన నివాళులు. 

మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్‌గారి స్ఫూర్తితో తీస్తున్న చిత్రయూనిట్‌కి నా అభినందనలు.. '' అని తెలుపుతూ సీతక్క ఈ టీజర్‌ను ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు సీతక్కకు మెగా, నందమూరి అభిమానులు ధన్యవాదాలు తెలుపుతూ.. కామెంట్స్‌ చేస్తున్నారు.Updated Date - 2020-10-23T00:34:23+05:30 IST

Read more