‘సీరు’ విజయంపై ధీమాగా ఉన్నారట

ABN , First Publish Date - 2020-02-04T20:43:06+05:30 IST

వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రత్నశివ దర్శకత్వంలో జీవా, రియా సుమన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీరు’. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు

‘సీరు’ విజయంపై ధీమాగా ఉన్నారట

వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రత్నశివ దర్శకత్వంలో జీవా, రియా సుమన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీరు’. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విజయంపై చిత్ర బృందం ధీమాగా ఉంది. అదే సమయంలో ప్రమోషన్లలోనూ బిజీగా ఉంది.


తాజాగా చెన్నైలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో జీవా మాట్లాడుతూ, ‘‘సినిమా బాగా వచ్చింది. అయితే ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే విడుదల చేయడమే పెద్ద కష్టం. ‘సీరు’ విజయంపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇందులో కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా, దేనికీ భయపడని యువకుడి పాత్రలో నటించాను. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ఇదొక పక్కా కమర్షియల్‌ సినిమా. కుటుంబంతో కలిసి జాలీగా చూడొచ్చు. అలాగే యూత్‌ని మెప్పించే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. 


హీరోయిన్‌ రియా సుమన్‌ మాట్లాడుతూ.. ‘‘తొలిసారి తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. షూటింగ్‌ సమయంలో నటన గురించి జీవా సలహాలు ఇచ్చారు’’ అంది. మరో నటి చాందిని మాట్లాడుతూ.. నాకు నటించాలన్న ఆలోచన లేదు. అయితే దర్శకుడు రత్నశివ ఈ పాత్రలో నేనే నటించాలని పట్టుబట్టారు. ఆయన చెప్పిన కథ, నా కథాపాత్ర బాగా నచ్చాయి. సవాలుతో కూడుకున్న పాత్ర. పూర్తిగా న్యాయం చేశాననే నమ్ముతున్నాను. ఇక జీవాతో కలిసి నటించడం సంతోషంగా ఉంది..అని పేర్కొంది. కాగా, ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం, ప్రసన్న ఎస్‌.కుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు. తాజాగా విడుదల చేసిన మూడు నిమిషాల స్నీక్‌ పీక్‌ వీడియోకి సినీ అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

Updated Date - 2020-02-04T20:43:06+05:30 IST