సీర‌త్ క‌పూర్‌కు క‌లిసి రావడం లేదు!

ABN , First Publish Date - 2020-05-26T17:50:07+05:30 IST

కొంత మంది హీరోయిన్స్‌కు ఎంత క‌ష్ట‌ప‌డ్డా అదృష్టం కలిసి రాదు. ఇప్పుడు హీరోయిన్ సీర‌త్‌క‌పూర్ విష‌యం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

సీర‌త్ క‌పూర్‌కు క‌లిసి రావడం లేదు!

కొంత మంది హీరోయిన్స్‌కు ఎంత క‌ష్ట‌ప‌డ్డా అదృష్టం కలిసి రాదు. ఇప్పుడు హీరోయిన్ సీర‌త్‌క‌పూర్ విష‌యం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన‌ హీరోయిన్ సీర‌త్‌క‌పూర్‌.. ఆ సినిమాతో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ అమ్మ‌డు త‌ర్వాత నటించిన టైగ‌ర్‌, కొలంబ‌స్‌, రాజుగారిగ‌ది 2, ఒక్క‌క్ష‌ణం, ట‌చ్ చేసి చూడు చిత్రాల్లో న‌టించింది. అయితే మంచి విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది. అయితే కృష్ణ అండ్ హిజ్ లీల‌, మా వింత‌గాథ వినుమ సినిమాల‌పై మంచి ఆశ‌ల‌నే పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో థియేట‌ర్స్‌లో విడుద‌ల కావ‌డం లేదు. ఈ రెండు చిత్రాల‌ను ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు చూస్తున్నారు. మ‌రి ఈ చిత్రాలు ఓటీటీలో ఎలాంటి స‌క్సెస్‌ల‌ను ద‌క్కించుకుంటాయో చూడాలి. 

Updated Date - 2020-05-26T17:50:07+05:30 IST