ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తా!

ABN , First Publish Date - 2020-05-26T04:26:09+05:30 IST

‘నో పెళ్లి’ పాటను విడుదల చేసిన నితిన్‌, ‘‘డార్లింగ్‌ సాయితేజ్‌! నువ్వు ఇచ్చిన బహుమతి బావుంది. ‘సోలో బతుకే సో బెటర్‌’లో పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, నువ్వు ఎన్ని రోజులు...

ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తా!

‘నో పెళ్లి’ పాటను విడుదల చేసిన నితిన్‌, ‘‘డార్లింగ్‌ సాయితేజ్‌! నువ్వు ఇచ్చిన బహుమతి బావుంది. ‘సోలో బతుకే సో బెటర్‌’లో పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, నువ్వు ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తా! కొన్నిసార్లు చేసుకోవడంలో టైమ్‌ గ్యాప్‌ ఉండొచ్చు ఏమో గానీ, చేసుకోవడం మాత్రం పక్కా’’ అన్నారు. ‘‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను డార్లింగ్‌! సెట్‌ చేస్తా. పెళ్లికి సిద్ధమైనా... మాలాంటి సింగిల్స్‌ కోసం సాంగ్‌ లాంచ్‌ చేసినందుకు థ్యాంక్స్‌’’ అని సాయితేజ్‌ అన్నారు. పాటలో సందడి చేసిన వరుణ్‌తేజ్‌, రానా దగ్గుబాటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల తన ప్రేమ విషయం ప్రేక్షకులందరికీ చెప్పిన రానా దగ్గుబాటి, ఈ పాటలో ‘నో పెళ్లి... ఈ తప్పే చేయకురా వెళ్లి’ అనడం గురించి ‘‘నా యూత్‌లో టంగ్‌ స్లిప్‌ అవ్వడం అనొచ్చు’’ అని అన్నారు.

Updated Date - 2020-05-26T04:26:09+05:30 IST