సాయితేజ్ పొలిటికల్ మూవీ!

ABN , First Publish Date - 2020-09-24T02:00:46+05:30 IST

కరోనా కారణంగా ఇన్ని రోజులూ ఇళ్లకే పరిమితమైన సినిమా హీరోలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.

సాయితేజ్ పొలిటికల్ మూవీ!

కరోనా కారణంగా ఇన్ని రోజులూ ఇళ్లకే పరిమితమైన సినిమా హీరోలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. షూటింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నారు. మెగా హీరో సాయితేజ్ ఇటీవల `సోలో బ్రతుకే సో బెటరు` సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. వచ్చే నెల నుంచి తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడు. 


`ప్రస్థానం` డైరెక్టర్ దేవకట్టాతో సాయితేజ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల మూడో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని దేవ కట్టా ట్విటర్ ద్వారా ప్రకటించాడు. అక్టోబర్ రెండో వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందబోతున్నట్టుగా తెలుస్తోంది.
Updated Date - 2020-09-24T02:00:46+05:30 IST