భర్తను చూసి గర్వపడుతున్న హీరోయిన్

ABN , First Publish Date - 2020-03-15T02:37:59+05:30 IST

ఏ భార్య అయినా భర్తను చూసి గర్వపడుతుంది. దీనికి సినీ సెలబ్రిటీలేమీ మినహాయింపు కాదు. కోలీవుడ్‌ హీరో ఆర్య

భర్తను చూసి గర్వపడుతున్న హీరోయిన్

ఏ భార్య అయినా భర్తను చూసి గర్వపడుతుంది. దీనికి సినీ సెలబ్రిటీలేమీ మినహాయింపు కాదు. కోలీవుడ్‌ హీరో ఆర్య భార్య సాయేషా కూడా తన భర్తను చూసి ఓ సందర్భంలో గర్వపడడమే కాకుండా తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంతకీ అసలు సంగతేమిటంటే....ఆర్య కోలీవుడ్‌లో ఓ సినిమా కోసం విపరీతంగా వర్కవుట్లు చేస్తున్నాడట! దానికి సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.


దానికి ఆయనగారి భార్య సాయేషా ‘పని పట్ల నీ నిబద్ధత, నీ కష్టం చూసి భార్యగా గర్వపడుతున్నాను’ అంటూ తిరిగి పోస్టు చేసింది. భర్త గొప్పతనం చూసి ఏ భార్య అయినా పొగుడుతుందనీ, కానీ ఆ పొగడ్తలు ఇతరుల నోటివెంట వస్తేనే సంతోషించాలంటున్నారు కోలీవుడ్‌ జనాలు.

Updated Date - 2020-03-15T02:37:59+05:30 IST