రీమేక్‌చిత్రాలకు కేరాఫ్‌గా సత్యదేవ్‌

ABN , First Publish Date - 2020-09-08T19:05:41+05:30 IST

సత్యదేవ్‌.. విలక్షణమైన పాత్రలతో నటుడిగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నారు.

రీమేక్‌చిత్రాలకు కేరాఫ్‌గా సత్యదేవ్‌

సత్యదేవ్‌.. విలక్షణమైన పాత్రలతో నటుడిగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన సత్యదేవ్‌ ఇప్పుడు హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా రాణిస్తున్న సత్యదేవ్‌ విషయంలో హీరోగా చేస్తున్న సినిమాలను గమనిస్తే ఆయన చేసిన, చేస్తున్న సినిమాలన్నీ రీమేక్‌ సినిమాలే కావడం గమనించాల్సిన విషయం.  

సత్యదేవ్‌ హీరోగా నటించిన 'బ్లఫ్‌ మాస్టర్‌' సినిమా తమిళ చిత్రం 'చతురంగవేట్టై' సినిమాకు రీమేక్‌. తర్వాత హీరోగా చేసిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా మలయాళ చిత్రం 'మహేశింతే ప్రతీకారమ్‌'కు రీమేక్‌. ఇప్పుడు తమన్నాతో సత్యదేవ్‌కలిసి నటిస్తోన్న 'గుర్తుందా శీతాకాలం' సినిమా కన్నడ చిత్రం 'లవ్‌ మాక్‌టైల్‌'కు రీమేక్‌. అలాగే రీసెంట్‌గా అనౌన్స్‌ అయిన 'తిమ్మరుసు' చిత్రం కూడా కన్నడ చిత్రానికి రీమేకేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాల మధ్యలో సత్యదేవ్‌ చేసిన '47 డేస్‌' మాత్రమే రీమేక్‌ కాదు.. మిగిలిన చిత్రాలన్నీ రీమేక్‌లే కావడం గమనార్హం. 


Updated Date - 2020-09-08T19:05:41+05:30 IST