3 భాషల్లో రూపొందుతోన్న ‘స‌మిధ‌’ అప్‌డేట్‌

ABN , First Publish Date - 2020-12-18T23:38:59+05:30 IST

య‌థార్ధ సంఘ‌ట‌నల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ''రాజ‌స్థాన్‌లో జ‌రిగిన య‌థార్ధ సంఘ‌ట‌న ఆధారంగా

3 భాషల్లో రూపొందుతోన్న ‘స‌మిధ‌’ అప్‌డేట్‌

య‌థార్ధ సంఘ‌ట‌నల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ''రాజ‌స్థాన్‌లో జ‌రిగిన య‌థార్ధ సంఘ‌ట‌న ఆధారంగా మూడు భాష‌ల్లో ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌గా 'స‌మిధ' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాను'' అంటున్నారు ద‌ర్శ‌కుడు సతీష్ మాలెంపాటి. 'మర్మం'‌, 'కనులు కలిసాయి`వంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించి ఇప్పుడు వెండితెర‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు సతీష్‌ మాలెంపాటి. ఆయన క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో  క‌న్న‌డ స్టార్ హీరో శ‌శికుమార్ త‌న‌యుడు అక్షిత్ శ‌శికుమార్ హీరోగా నటిస్తున్నారు.  తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో 'ఉండిపోరాదే' మూవీ ఫేమ్ అనువ‌ర్ణ‌, త‌మిళ న‌టి ఛాందిని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అరుణం ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్  పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ 23 నుంచి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.


ఈ సందర్బంగా చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీష్ మాలెంపాటి మాట్లాడుతూ.. ''స‌మిధ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ డిసెంబ‌ర్ 16 వ‌ర‌కూ జ‌‌రిగింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీల‌క‌ స‌న్నివేశాలు చిత్రీక‌రించాం. ఈ నెల 23 నుండి సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా రెండు గంట‌ల పాటు ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులని ఎంగేజ్ చేస్తుంది. ఛేజింగులు, యాక్ష‌న్ సీన్స్‌తో ఆడియ‌న్స్‌కి ఒక ఫ‌ర్ఫెక్ట్ థ్రిల్ల‌ర్ చూసిన అనుభూతినిస్తుంది" అన్నారు.Updated Date - 2020-12-18T23:38:59+05:30 IST