కొత్త చిత్రానికి సై

ABN , First Publish Date - 2020-08-05T05:55:09+05:30 IST

ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌కి చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థలో యువ కథానాయకుడు శర్వానంద్‌ ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ‘శ్రీకారం’, ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో...

కొత్త చిత్రానికి సై

ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌కి చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థలో యువ కథానాయకుడు శర్వానంద్‌ ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ‘శ్రీకారం’, ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్న అతను, కొత్త చిత్రానికి పచ్చజెండా ఉపారు. శర్వానంద్‌తో సినిమా చేయనున్నట్టు నిర్మాతలు నారాయణ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు తెలిపారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామన్నారు. ఇటీవల నిఖిల్‌ హీరోగా ఈ సంస్థలో ఓ సినిమా ప్రకటించారు.

Updated Date - 2020-08-05T05:55:09+05:30 IST