సరోజ్‌ఖాన్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఏం పెట్టారంటే...

ABN , First Publish Date - 2020-07-03T13:39:28+05:30 IST

గుండెపోటుతో శుక్రవారం మరణించిన బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారి చేసిన పోస్టు అందరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది.....

సరోజ్‌ఖాన్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఏం పెట్టారంటే...

ముంబై : గుండెపోటుతో శుక్రవారం మరణించిన బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారి చేసిన పోస్టు అందరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది. బాలీవుడ్‌లో ‘మాస్టర్ జీ’, ‘మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ’ అని ప్రేమగా పిలిచే సరోజ్ ఖాన్ మరణించే ముందు చివరిసారిగా జూన్ 14వతేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనపై ఇన్‌స్టాగ్రామ్ పోస్టు పెట్టారు. తాను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎప్పుడూ పనిచేయకున్నా అతన్ని ఎప్పుడూ ఇష్టపడేదాన్నని సరోజ్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘నేను మీతో ఎప్పుడూ పని చేయలేదు కానీ సుశాంత్, నేను చాలాసార్లు కలుసుకున్నాం. మీ జీవితంలో ఏం తప్పు జరిగింది? మీరు మీ లైఫ్‌లో ఇంత తీవ్రమైన అడుగు వేసినందుకు నేను షాక్ అయ్యాను.దేవుడు మీ ఆత్మకు శాంతి చేకూర్చుగాక...మీ తండ్రి,  సోదరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సమయంలో  వారికి సంతాపం తెలుపుతున్నాను. నేను మీ అన్ని సినిమాల్లోనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తాను.’’ అంటూ సరోజ్ ఖాన్ సుశాంత్ మృతి పట్ల తన సంతాపం తెలిపారు.  సుశాంత్ మరణం పట్ల సంతాపం తెలిపిన 20 రోజుల్లోపే సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించడంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. 

Updated Date - 2020-07-03T13:39:28+05:30 IST