మొత్తానికి మహేష్‌ కూడా మైండ్ బ్లాంక్ చేశాడుగా..

ABN , First Publish Date - 2020-07-12T04:23:29+05:30 IST

సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. మరీ ముఖ్యంగా పాటల పరంగా ఈ రెండు

మొత్తానికి మహేష్‌ కూడా మైండ్ బ్లాంక్ చేశాడుగా..

సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. మరీ ముఖ్యంగా పాటల పరంగా ఈ రెండు చిత్రాలు ఇప్పటికీ సౌండ్ చేస్తూనే ఉన్నాయి. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ చేస్తున్న అలజడి తెలియంది కాదు. రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక మహేష్ బాబు కూడా తన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మైండ్ బ్లాంక్ సాంగ్‌తో మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు. 


ఈ చిత్ర వీడియో సాంగ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాంక్’ సాంగ్ ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్, రష్మికల డ్యాన్స్, దేవిశ్రీ కంపోజింగ్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఇలా ఒక్కటేమిటి.. ప్రతీది ఈ పాటకు హైలెట్టే. చాలా గ్యాప్ తర్వాత మహేష్ కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసి అలరించాడు. ఈ పాట చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులే లేవు. అందుకే అభిమానులు ఇంత పెద్ద సక్సెస్ చేసి.. పాటని టాప్ పొజిషన్‌లో నిలబెట్టారు. 

Updated Date - 2020-07-12T04:23:29+05:30 IST