అక్కడ ‘సైరా’ను బీట్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’

ABN , First Publish Date - 2020-08-08T03:28:51+05:30 IST

తెలుగు సినిమాకు కన్నడలో కూడా మంచి డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. తెలుగు భాషలో విడుదలయ్యే సినిమాలు సౌత్‌లోని అన్ని భాషలలో డబ్

అక్కడ ‘సైరా’ను బీట్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’

తెలుగు సినిమాకు కన్నడలో కూడా మంచి డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. తెలుగు భాషలో విడుదలయ్యే సినిమాలు సౌత్‌లోని అన్ని భాషలలో డబ్ అవుతుంటాయి. నార్త్‌లో తెలుగు సినిమాలను డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. అయితే కన్నడ స్మాల్ స్క్రీన్‌పై తెలుగు చిత్రం ఇప్పుడు రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం కన్నడ డబ్ వెర్షన్ ఇటీవల అక్కడ టెలికాస్ట్ అయింది. ఈ చిత్రం ఇప్పటి వరకు అక్కడ టెలికాస్ట్ అయి అధిక టీఆర్పీ సాధించిన తెలుగు చిత్రాలను అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 


ఇప్పటి వరకు కన్నడ స్మాల్ స్ర్కీన్‌పై చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం 6.3 టీఆర్పీ సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడీ రికార్డును మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ‘6.5’ టీఆర్పీతో బీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటించింది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సైరా’ చిత్రాల తర్వాత అత్యధిక టీఆర్పీ సాధించిన వరుసలో రామ్ చరణ్ రంగస్థలం (6 టీఆర్పీ), విజయ్ దేవరకొండ గీతగోవిందం (5.6 టీఆర్పీ) చిత్రాలు మూడు, నాలుగు స్థానాలలో నిలిచాయి. 

Updated Date - 2020-08-08T03:28:51+05:30 IST

Read more