`సరిలేరు..` సరికొత్త రికార్డు!

ABN , First Publish Date - 2020-12-08T22:46:02+05:30 IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`.

`సరిలేరు..` సరికొత్త రికార్డు!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రికార్డు కలెక్షన్లు సాధించింది. తాజాగా మరో సరికొత్త రికార్డును ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. 


అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు సాధించి ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో `సరిలేరు నీకెవ్వరు` అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఏడాదికి ఓవరాల్‌గా భారత్‌లో మూడో స్థానం సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ `దిల్ బెచారా`, సూర్య `సూరారై పొట్రు` తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.Updated Date - 2020-12-08T22:46:02+05:30 IST