శరత్ కుమార్ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-07-31T13:53:24+05:30 IST
తాజాగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన టుడు శరత్‌కుమార్‌కు ఇలాంటి ఓ చేదు ఘటన ఎదురైంది.

ఎవరో ఒక సెలబ్రిటీ పేరు చెప్పి మోసం చేయడమనేది ఎక్కువైంది. పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తాజాగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన టుడు శరత్‌కుమార్‌కు ఇలాంటి ఓ చేదు ఘటన ఎదురైంది. ఆయన అప్రమత్తంగా ఉండి సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే.. శరత్ కుమార్ అఖిల భారత సమత్తుల కట్చి పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి కోవైకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోసాలకు పాల్పడే విషయం శరత్ కుమార్ దృష్టికి వచ్చింది. శరత్ కుమార్ సదరు వ్యక్తితో నేరుగా మాట్లాడటమే కాకుండా చెన్నై కమీషనర్‌కు సదరు వ్యక్తిపై ఫిర్యాదు కూడా చేశారు.