సీఎం రిలీఫ్ ఫండ్ కు అగ్ర హీరో సోదరి విరాళం

ABN , First Publish Date - 2020-04-06T18:27:46+05:30 IST

కరోనావైరస్ మన దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ అంటువ్యాధిపై పోరాడేందుకు విరాళాలు ఇవ్వాలని...

సీఎం రిలీఫ్ ఫండ్ కు అగ్ర హీరో సోదరి విరాళం

కరోనావైరస్ మన దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ అంటువ్యాధిపై పోరాడేందుకు విరాళాలు ఇవ్వాలని పిఎం మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితరులు విరాళాలు అందించారు. తాజాగా సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రియాదత్ ట్వీట్ లో తెలియజేశారు. నర్గీస్ దత్ ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్ర సీఎం  రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు విరాళంగా అందించామని తెలిపారు. 


Updated Date - 2020-04-06T18:27:46+05:30 IST