కేన్సర్‌ను జయించిన సంజూ భాయ్!

ABN , First Publish Date - 2020-10-21T22:21:58+05:30 IST

బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కేన్సర్‌పై విజయం సాధించాడు.

కేన్సర్‌ను జయించిన సంజూ భాయ్!

బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కేన్సర్‌పై విజయం సాధించారు. ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న సంజయ్ పూర్తి ఆరోగ్య వంతుడిగా మారారు. ఈ మేరకు సంజూ భాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. `మీ అందరితో ఈ వార్త పంచుకుంటుంటే నా హృదయం కృతజ్ఞతతో నిండిపోతోంద`ని సంజయ్ కామెంట్ చేశారు.


`కొన్ని వారాలుగా నేను, నా కుటుంబం కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. భరించేవాడికే బాధలు ఇస్తాడని కొందరు చెబుతుంటారు కదా.. అది నిజమే. ఈ రోజు నా పిల్లల బర్త్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను. నేను పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చాను. ఇదే నా పిల్లలకు నేను ఇవ్వగలిగే గొప్ప బహుమతి.


మీ అందరి మద్దతు, ఆశీర్వాదం లేకపోతే ఇది జరిగేది కాదు. ఇలాంటి కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచిన నా ఫ్యామిలీకి, అభిమానులకు రుణపడి ఉంటాను. కోకిలాబెన్ హాస్పిటల్‌ డా. సేవంతి, ఆమె వైద్య బృందానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాన`ని సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-21T22:21:58+05:30 IST