అమితాబ్ ఇంటికి శానిటేష‌న్‌

ABN , First Publish Date - 2020-07-12T19:37:43+05:30 IST

బ్రిహాన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన వ‌ర్క‌ర్స్ ఆదివారం అమితాబ్ ఇల్లు ‘జ‌ల్సా’కు చేరుకుని శానిటేష‌న్ వ‌ర్క్ చేశారు.

అమితాబ్ ఇంటికి శానిటేష‌న్‌

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ శ‌నివారం సాయంత్రం కోవిడ్ పాజిటివ్ కార‌ణంగా హాస్పిట‌ల్‌లోజాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. బ్రిహాన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన వ‌ర్క‌ర్స్  ఆదివారం అమితాబ్ ఇల్లు ‘జ‌ల్సా’కు చేరుకుని శానిటేష‌న్ వ‌ర్క్ చేశారు. బీఎంసీ వ‌ర్క‌ర్స్ అమితాబ్ ఇంటికి వ‌ద్ద‌కు వ‌చ్చిన సంద‌ర్భంలోని వీడియో, ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అమితాబ్ కుటుంబంలో అమితాబ్‌, అభిషేక్‌కు క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ రిపోర్ట్ రాగా.. అమితాబ్ స‌తీమ‌ణి జ‌య‌బాదురి, అభిషేక్ స‌తీమ‌ణి ఐశ్వ‌ర్యారాయ్‌, కుమార్తె ఆరాధ్య‌ల‌కు నెగ‌టివ్ రిపోర్ట్ వ‌చ్చింది. Updated Date - 2020-07-12T19:37:43+05:30 IST