రాజమౌళికి సందీప్‌ రెడ్డి సవాల్‌

ABN , First Publish Date - 2020-04-20T09:23:35+05:30 IST

కోవిడ్‌ 19 కారణంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ వల్ల సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఇంటి పని, వంట పని, తోట పని చేస్తూ చాలామంది సినీ సెలబ్రిటీలు కనిపించారు...

రాజమౌళికి సందీప్‌ రెడ్డి సవాల్‌

కోవిడ్‌ 19 కారణంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ వల్ల సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఇంటి పని, వంట పని, తోట పని చేస్తూ చాలామంది సినీ సెలబ్రిటీలు కనిపించారు. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా వంట సామాను కడుగుతూ, ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించారు. ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్‌ చేసి ‘‘మగవారు కూడా ఇంటి పనిని గొప్పగా చేయగలరు. బాధ్యతాయుతమైన పురుషుడు క్వారంటైన్‌ సమయంలోనూ ఇంటి భారాన్ని మహిళపై వేయడు. దయచేసి ఇంటి పనిలో మహిళలకు సాయం చేయండి. నిజమైన పురుషుడిలా ఉండండి. ఎస్‌.ఎ్‌స.రాజమౌళి సర్‌.. మీరు కూడా ఇలాంటి వీడియోలు అప్‌లోడ్‌ చేసి అందరిలోనూ స్ఫూర్తి నింపాలని కోరుతున్నా’ అంటూ ‘బీ ద రియల్‌మెన్‌’ అని రాజమౌళికి ట్యాగ్‌ చేశారు. సందీ్‌పరెడ్డి విసిరిన సవాల్‌ను రాజమౌళి స్వీకరించారు. ‘‘ఛాలెంజ్‌ స్వీకరించా సందీప్‌. ఇంటి పనిని మనం కూడా పంచుకోవడం చాలా ముఖ్యం. నేను ఇంట్లో చేస్తున పనిని వీడియో తీసి అప్‌లోడ్‌ చేస్తా’’ అని రాజమౌళి రిప్లై ఇచ్చారు. 

Updated Date - 2020-04-20T09:23:35+05:30 IST