వి.వి.వినాయక్ క్లాప్‌తో సందీప్ మాధవ్ 'గంధర్వ' ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-27T21:17:10+05:30 IST

'వంగవీటి, 'జార్జిరెడ్డి' చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ హీరోగా కొత్త చిత్రం 'గంధర్వ' ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.

వి.వి.వినాయక్ క్లాప్‌తో  సందీప్ మాధవ్  'గంధర్వ' ప్రారంభం

'వంగవీటి, 'జార్జిరెడ్డి' చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ హీరోగా కొత్త చిత్రం 'గంధర్వ' ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్. యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్  పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, క్రిష్, హీరో శ్రీకాంత్, సాయికుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ...


వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ అధినేత వీరశంకర్ మాట్లాడుతూ "మంచి సెన్సిబిలిటీస్ ఉన్న  డైరెక్టర్ అప్సర్. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ గంధర్వ అనే అద్భుతమైన కథని రెడీ చేశాడు. రెండు నెలలు కథపై డిస్కషన్ చేసి స్క్రీన్ ప్లే రాశాం. ఈ కథకి సందీప్ అయితే యాప్ట్‌గా ఉంటుందని సెలెక్ట్ చేశాం. జార్జిరెడ్డి తర్వాత తనకి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ సెలెక్టీవ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు" అన్నారు.  నిర్మాత యం.యన్. మధు మాట్లాడుతూ "మా బ్యానర్‌లో ఇది రెండో చిత్రం. డిసెంబర్‌ 28నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మేలో గంధర్వ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. 


హీరో సందీప్ మాధవ్ (శాండీ) మాట్లాడుతూ "'జార్జిరెడ్డి' తర్వాత చాలా కథలు విన్నాను. అన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్‌లో ఉన్నాయి. కొత్తగా ఎదైనా చెయ్యాలని వైయిట్ చేస్తున్న నాకు అప్సర్ కథ చెప్పగానే ఈ మూవీలో నేనుకూడా ఉంటే బాగుండు అనిపించి వెంటనే ఒకే చెప్పా.  తెలుగు సినిమా ఫార్మేట్‌లో ఓ కొత్త యాంగిల్ ని పరిచయం చేస్తున్నారు" అన్నారు. చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ "నేను మిలటరీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాను. అలాగని ఇది అలాంటి సబ్జెక్ట్ కాదు. శాండీ మిలటరీ క్యారెక్టర్ అయినా ఫామిలీ సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. గంధర్వ అంటే నిత్య యవ్వనంలా ఉండటం అని అర్థం. హిలేరియస్ ఇంటెన్సిటీ ఉంటుంది. మే 21న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మా నిర్మాతలు ప్లాన్ చేశారు.. అన్నారు.Updated Date - 2020-12-27T21:17:10+05:30 IST