కుల వృత్తిలో సంపూర్ణేశ్‌బాబు

ABN , First Publish Date - 2020-04-25T05:39:46+05:30 IST

నటుడు సంపూర్ణేశ్‌బాబు వృత్తి రీత్యా స్వర్ణకారుడు. సినీరంగంలోకి వెళ్లక ముందు స్వర్ణకారునిగా పనులు నేర్చుకున్న వారే. లాక్‌డౌన్‌లో సరదాగా కులవృత్తి పనులు చేసి...

కుల వృత్తిలో సంపూర్ణేశ్‌బాబు

నటుడు సంపూర్ణేశ్‌బాబు వృత్తి రీత్యా స్వర్ణకారుడు. సినీరంగంలోకి వెళ్లక ముందు  స్వర్ణకారునిగా పనులు నేర్చుకున్న వారే. లాక్‌డౌన్‌లో సరదాగా కులవృత్తి పనులు చేసి భార్యకు కాలి మట్టెలు, కూతురుకు కాలి గజ్జెల పట్టీలు తయారు చేసి ఇచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా సిద్దిపేటలోనే ఉంటున్న ఆయన మూడు  రోజుల క్రితం అత్తవారిల్లయిన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్దికి వెళ్లారు. అక్కడ ఊరికే ఉండలేక పాత వెండితో భార్య ఉమారాణికి వెండి మట్టెలు, చిన్న కుమార్తె గాయత్రి కాలి గజ్జెల పట్టీలు తెగిపోతే అతికి కడిగారు. దీన్ని ఆయన బావమరిది వీడియో తీయగా గురువారం రాత్రి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

Updated Date - 2020-04-25T05:39:46+05:30 IST