గోపీచంద్‌కు సంప‌త్ నంది శుభాకాంక్ష‌లు

ABN , First Publish Date - 2020-05-12T17:48:54+05:30 IST

హీరో గోపీచంద్‌కు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది పెళ్లిరోజు శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేశారు. హీరో గోపీచంద్, రేష్మ‌ను 2013 మే 12న వివాహం చేసుకున్నారు.

గోపీచంద్‌కు సంప‌త్ నంది శుభాకాంక్ష‌లు

హీరో గోపీచంద్‌కు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది పెళ్లిరోజు శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేశారు. హీరో గోపీచంద్, రేష్మ‌ను 2013 మే 12న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు. వీరికి పెళ్లై ఏడు వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది వారికి ట్విట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ‘సీటీమార్’ అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత సీటీమార్ విడుద‌ల‌పై ఓ క్లారిటీ రానుంది. 

Updated Date - 2020-05-12T17:48:54+05:30 IST