సంపత్ నంది కొత్త చిత్రం ప్రారంభం!

ABN , First Publish Date - 2020-08-17T21:51:50+05:30 IST

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త చిత్రం

సంపత్ నంది కొత్త చిత్రం ప్రారంభం!

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త చిత్రం ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ తన శ్రీసత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


దర్శకుడు అశోక్ తేజ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం కొద్ది సేపటి క్రితం జరిగింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. 


Updated Date - 2020-08-17T21:51:50+05:30 IST