రెండు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి: స‌మీరా రెడ్డి

ABN , First Publish Date - 2020-05-13T19:24:04+05:30 IST

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులైన చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారితో క‌లిసి న‌టించిన స‌మీరారెడ్డి పెళ్లి చేసుకుని సెటిలైంది. సినిమాల‌కు దూర‌మైన ఈమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది.

రెండు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి:  స‌మీరా రెడ్డి

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులైన చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారితో క‌లిసి న‌టించిన స‌మీరారెడ్డి పెళ్లి చేసుకుని సెటిలైంది. సినిమాల‌కు దూర‌మైన ఈమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా దేశంలో నెల‌కొన్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో స‌మీరారెడ్డి ఇంటికే ప‌రిమితమైంది. ఈ సంద‌ర్భంగా సమీరారెడ్డి ఎబీఎన్ ఆంధ్ర‌జ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ‘‘క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డ్డ ప‌రిస్థితులు ఎప్ప‌టికీ ఇలాగే ఉంటాయ‌ని చెప్ప‌ను. మ‌రో రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాలి. మా పిల్ల‌ల‌ను భ‌య‌పెట్ట‌కుండా మాన‌సికంగా సిద్ధం చేయాల‌ని అనుకుంటున్నాను. క‌రోనాతో పోరాడుతున్నామ‌ని వాళ్ల‌కు ఉత్సాహం క‌లిగేలా చెబుతాను’’ అన్నారు. 

Updated Date - 2020-05-13T19:24:04+05:30 IST