‘సామ్‌ జామ్’.. ఫుల్‌ టైమ్‌ హోస్ట్‌గా సమంత..!

ABN , First Publish Date - 2020-11-06T23:10:54+05:30 IST

సినిమాలు, వెబ్‌ సిరీస్‌లే కాకుండా.. ప్రత్యేకమైన షోలతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఓటీటీ 'ఆహా' సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తమాషా విత్‌ హర్ష వంటి

‘సామ్‌ జామ్’.. ఫుల్‌ టైమ్‌ హోస్ట్‌గా సమంత..!

సినిమాలు, వెబ్‌ సిరీస్‌లే కాకుండా.. ప్రత్యేకమైన షోలతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఓటీటీ 'ఆహా' సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తమాషా విత్‌ హర్ష వంటి ప్రోగ్రామ్‌ని ప్రకటించిన 'ఆహా'.. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ సమంతతో 'సామ్‌ జామ్‌' అనే టాక్‌ షోని ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ టాక్‌షోకు సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల నాగ్‌ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌ షోకు పార్ట్ టైమ్‌ హోస్ట్‌గా వ్యవహరించిన సమంత.. ఈ షోతో ఫుల్‌ టైమ్‌ హోస్ట్‌గా మారుతున్నారు. ఇది కేవలం టాక్‌ షో మాత్రమే కాదు.. సమాజంలోని సమస్యల గురించి ప్రశ్నించడం.. టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడం వంటి డిఫరెంట్‌ స్టైల్‌ను ఇందులో తెలుగు ప్రేక్షకులు చూడవచ్చని 'ఆహా' టీమ్‌ చెబుతోంది. ఈ షో వివరాలను తెలిపేందుకు శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


ఈ కార్యక్రమంలో సమంత అక్కినేని మాట్లాడుతూ.. ''చాలారోజుల తర్వాత ఇంట్లో ఎక్కువ సమయం గడిపే సమయం వచ్చింది. ప్రజలు చాలా సమస్యలు ఫేస్‌ చేశారు. కానీ ఎవరినీ తప్పు పట్టలేం. మనతో పాటు మన చుట్టు ఉన్నవాళ్లు, వాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఓ గ్రేట్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనొచ్చు. సామ్‌జామ్‌ షో చాలా పెద్ద ఛాలెంజ్‌. దీంతో పోల్చితే యాక్టింగ్‌ చాలా సులభమనిపిస్తుంది. హోస్టింగ్‌ సులభం కాదు. నాకు ఓ ఎక్స్‌టెన్షన్‌లాంటి షో అని భావిస్తున్నాను. ఇది అందరికీ సంతోషాన్ని అందించే షో అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఈ షో చేయడం ముఖ్యమనిపించడంతో ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకున్నాను. సామ్‌ జామ్‌ విషయానికి వస్తే మంచి టీం కుదిరింది. బిగ్‌బాస్‌ను హోస్ట్‌ చేయడమనేది నాగ్‌ మామ నిర్ణయం.  బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ చేసే సమయంలో నాకు నిద్ర పట్టేది కాదు. చాలా హార్డ్‌వర్క్‌ చేశాను. ఓ ఛాలెంజ్‌గా తీసుకుని హోస్ట్‌ చేశాను. సామ్‌ జామ్‌ విషయానికి వస్తే.. ఇది టాక్‌ షో కాదు, సమాజంలో సమస్యల గురించి మాట్లాడుతాం. టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తాం. అరవింద్‌గారితో కలిసి పనిచేయడం హ్యాపీగా, స్పెషల్‌గా అనిపిస్తుంది. నేను మాధ్యమం గురించి ఆలోచించలేదు. ఓ ఛాలెంజింగ్‌గా అనిపించడంతో షో చేయడానికి ఒప్పుకున్నాను.." అని తెలిపారు. Updated Date - 2020-11-06T23:10:54+05:30 IST