సాహసయాత్రకు సమంత, చైతన్య!

ABN , First Publish Date - 2020-05-12T18:14:38+05:30 IST

ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

సాహసయాత్రకు సమంత, చైతన్య!

ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. కొందరు తమ పాత ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. 


టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సమంత, చైతన్య ప్రస్తుత లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత వాటిని అభిమానులతో పంచుకుంటోంది.  తాజాగా స‌మంత పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. తను, భర్త చైత‌న్య‌, పెంపుడు కుక్క హ్యాష్‌ కారులో కూర్చుని ఉన్న ఓ పాత‌ ఫోటోను సమంత తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  `ఓ గొప్ప సాహ‌స‌యాత్ర‌కు సిద్ధమ‌వుతున్నాం.. దాదాపుగా` అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటో కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే మిలియ‌న్ లైక్స్ రాబ‌ట్టింది.

Updated Date - 2020-05-12T18:14:38+05:30 IST