సూర్య సినిమాపై సమంత ప్రశంసలు

ABN , First Publish Date - 2020-12-02T03:32:39+05:30 IST

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా దీపావళి కానుకగా

సూర్య సినిమాపై సమంత ప్రశంసలు

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న ఈ సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు ఎందరో ప్రశంసలు కురిపించారు. తాజాగా అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్‌ సమంత ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా ఆమె ట్విట్టర్‌లో ఈ సినిమాపై తన రివ్యూని తెలిపారు.


ఫిల్మ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా).. అని తెలుపుతూ.. హీరో సూర్య, హీరోయిన్‌ అపర్ణా బాలమురళీ నటనకు అలాగే సుధాకొంగర డైరెక్షన్‌కు ఫిదా అయినట్లుగా సమంత తెలిపింది. అలాగే ఈ సినిమాను విడుదల చేసిన అమెజాన్‌ ప్రైమ్‌ను కూడా అభినందించింది. ఇటువంటి స్ఫూర్తిదాయక చిత్రం కోసమే వేచిచూస్తున్నానని సమంత తన ట్వీట్‌లో పేర్కొంది. సమంత ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన హీరోయిన్‌ అపర్ణా బాలమురళీ సమంతకు థ్యాంక్స్‌ చెప్పింది.Updated Date - 2020-12-02T03:32:39+05:30 IST