సమంత న్యూ ఇయర్ గిఫ్ట్!

ABN , First Publish Date - 2020-12-30T14:43:19+05:30 IST

ఇన్నాళ్లూ వెండితెర మీద మెరిసిన అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం డిజిటిల్ వేదిక మీద దృష్టి సారించింది.

సమంత న్యూ ఇయర్ గిఫ్ట్!

ఇన్నాళ్లూ వెండితెర మీద మెరిసిన అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం డిజిటిల్ వేదిక మీద దృష్టి సారించింది. ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్ జామ్` మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇక, కొత్త సంవత్సరంలో సమంత తన అభిమానులకు మరో బహుమతి అందించబోతోంది. 


సమంత కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మేన్-2` కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత నెగిటివ్ రోల్‌లో కనిపించబోతోంది. తీవ్రవాది పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. రాజ్-డీకే ద్వయం రూపొందించిన `ఫ్యామిలీ మేన్` వెబ్ సిరీస్ తొలి భాగం మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా త్వరలో `ఫ్యామిలీ మేన్-2` రాబోతోంది. Updated Date - 2020-12-30T14:43:19+05:30 IST