సమంతకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫొటో!

ABN , First Publish Date - 2020-12-25T16:17:02+05:30 IST

`ఏ మాయ చేసావే` సినిమాతో తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నాగచైతన్య, సమంత.

సమంతకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫొటో!

`ఏ మాయ చేసావే` సినిమాతో తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నాగచైతన్య, సమంత. ఇద్దరి కెరీర్లోనూ ఇదే తొలి హిట్. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన వీరు 2017లో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని మూడేళ్లైనా ఇప్పటికీ వీరు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గానే నిలుస్తున్నారు. 


తాజాగా సోషల్ మీడియా ద్వారా సమంత అభిమానులతో ముచ్చటించింది. ఆ సందర్భంగా ఓ నెటిజన్.. `మీ మోస్ట్ మెమోరబుల్ పిక్ ఏది?` అని అడగారు. దీనికి స్పందించిన సామ్..`ఏ మాయ చేసావే` సమయంలో నాగచైతన్యతో కలిసి దిగిన ఫస్ట్ ఫోటోషూట్ పిక్‌ను షేర్ చేసింది. `ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఫొటో` అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Updated Date - 2020-12-25T16:17:02+05:30 IST