సమంత అస్సలు తగ్గడం లేదు..

ABN , First Publish Date - 2020-09-16T03:33:59+05:30 IST

హీరోయిన్‌ సమంత.. గ్లామర్‌ విషయంలో రోజురోజుకీ మెరిసిపోతుంది. మాములుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్ల పని అయిపోయిందని

సమంత అస్సలు తగ్గడం లేదు..

హీరోయిన్‌ సమంత.. గ్లామర్‌ విషయంలో రోజురోజుకీ మెరిసిపోతుంది. మాములుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్ల పని అయిపోయిందని అంతా అంటుంటారు. కానీ సమంత ఈ విషయంలో ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె గ్లామర్‌గా కనిపిస్తూ.. సోషల్‌ మీడియాని హీటెక్కిస్తుంది. సినిమాల విషయంలో కాస్త ఆచితూచి ఆలోచిస్తున్న సమంత, మ్యాగ్‌జైన్ కవర్‌ పేజీ అలాగే ఫొటోషూట్స్‌ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. అందుకు సాక్ష్యం తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలే. 


బ్లాక్‌ అండ్‌ వైట్‌ సిరీస్‌ అని చెబుతూ సమంత కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ఈ ఫిక్స్‌లో ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలతో ఆమె అభిమానులైతే ఎంతో మురిసిపోతున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ రీచ్‌ అయిన సందర్భంగా.. తనని ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ..తప స్పెషల్‌ ఫొటోషూట్స్ స్టిల్స్‌ని సమంత షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.Updated Date - 2020-09-16T03:33:59+05:30 IST