సమంత హాట్ ఫొటోకు నెటిజన్ల ఫిదా!
ABN , First Publish Date - 2020-07-27T19:31:51+05:30 IST
యోగాను, ధ్యానంను విజయవంతంగా తమ జీవితానికి అన్వయించుకున్నవారిని ట్యాగ్ చేస్తూ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి

యోగాను, ధ్యానంను విజయవంతంగా తమ జీవితానికి అన్వయించుకున్నవారిని ట్యాగ్ చేస్తూ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి చేసిన పోస్ట్‌కు హీరోయిన్ సమంత స్పందించింది. తన హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ ఫొటోలో సమంత చాలా క్యూట్‌గా, సెక్సీగా ఉంది.
`డిఫరెంట్ సైడ్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్.. అన్నీ ఒక్కదాంట్లోనే` అని కామెంట్ చేసింది. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు గంటల్లోపే 7 లక్షలకు పైగా లైకులు సంపాదించింది. లాక్‌డౌన్ సమయంలో సమంత యోగాకు, ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించింది. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
Read more