పాతికేళ్ల తర్వాత కూడా..: సమంత

ABN , First Publish Date - 2020-10-05T21:07:01+05:30 IST

క‌ృష్ణవంశీ దర్శకత్వంలో `కింగ్` నాగార్జున నటించిన చిత్రం `నిన్నే పెళ్లాడతా`.

పాతికేళ్ల తర్వాత కూడా..: సమంత

క‌ృష్ణవంశీ దర్శకత్వంలో `కింగ్` నాగార్జున నటించిన చిత్రం `నిన్నే పెళ్లాడతా`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నాగార్జున కెరీర్లోని మరుపురాని చిత్రాలలో ఒకటిగా నిలిచింది. `నిన్నే పెళ్లాడతా`లోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా `ఎటో వెళ్లిపోయింది మనసు` పాట ఎవర్‌గ్రీన్. సందీప్ చౌతా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.


ఈ సినిమా 25వ వార్షికోత్సవం సందర్భంగా నాగ్‌కు సంగీత దర్శకుడు సందీప్ చౌతా తాజాగా ఓ మ్యూజికల్‌ గిప్ట్‌ను పంపారు. `ఏటో వెళ్లి డైరీస్` అంటూ సంగీత దర్శకుడు సందీప్‌ చౌతా తనకు అద్భుతమైన గిప్ట్ పంపినట్లుగా ట్విటర్ ద్వారా నాగ్‌ వెల్లడించారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్వీట్‌ను సమంత రీ ట్వీట్ చేసింది. `25 సంవత్సరాల తర్వాత.. ఇప్పటికీ వినిపిస్తున్నాయ`ని సమంత కామెంట్ చేసింది. 
Updated Date - 2020-10-05T21:07:01+05:30 IST

Read more