`రంగస్థలం`కు నన్ను వద్దన్నారు: సమంత

ABN , First Publish Date - 2020-12-25T18:34:05+05:30 IST

ప్రముఖ కథానాయిక సమంత కెరీర్లోని మరపురాని చిత్రాలలో `రంగస్థలం` ఒకటి.

`రంగస్థలం`కు నన్ను వద్దన్నారు: సమంత

ప్రముఖ కథానాయిక సమంత కెరీర్లోని మరపురాని చిత్రాలలో `రంగస్థలం` ఒకటి. ఈ సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత అద్భుత నటన ప్రదర్శించింది. వివాహం తర్వాత కూడా సమంతకు అవకాశాలు రావడానికి `రంగస్థలం` సినిమాయే కారణమని చెప్పాలి. ఈ సినిమాలో రామలక్ష్మి పాత్రకు తనను ఎంపిక చేసినపుడు జరిగిన విషయాన్ని సమంత తాజాగా `సామ్ జామ్` కార్యక్రమంలో వెల్లడించింది. 


``రంగస్థలం` చిత్రంలో రామలక్ష్మి పాత్రకు మొదట నన్ను అనుకున్నప్పుడు.. అసిస్టెంట్ డైరెక్టర్లు వద్దని చెప్పారట. `సమంత గ్లామరస్ హీరోయిన్. పల్లెటూరి అమ్మాయిగా ఆమెను ప్రేక్షకులు ఒప్పుకొంటారో లేదో తెలియదు. రామలక్ష్మి పాత్రకు సమంత సరిపోద`ని డైరెక్టర్ సకుమార్‌కు చెప్పారట. అయితే సుకుమార్ నాపై నమ్మకముంచారు. రామలక్ష్మి పాత్ర గురించి చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇక సినిమా విడుదల తర్వాత వచ్చిన స్పందన అద్భుతం. కెరీర్‌లో అలాంటి పాత్రలు చేయడం వల్ల కొత్త అనుభూతిని పొందుతామ`ని సమంత పేర్కొంది. 


Updated Date - 2020-12-25T18:34:05+05:30 IST