ఇక అవకాశాలు రావనుకున్నా: సమంత

ABN , First Publish Date - 2020-12-15T15:04:40+05:30 IST

వివాహం తర్వాత కూడా తన కెరీర్‌పై దృష్టి సారించి దూసుకుపోతోంది అక్కినేని వారి కోడలు సమంత.

ఇక అవకాశాలు రావనుకున్నా: సమంత

వివాహం తర్వాత కూడా తన కెరీర్‌పై దృష్టి సారించి దూసుకుపోతోంది అక్కినేని వారి కోడలు సమంత. సినిమాలు మాత్రమే కాకుండా డిజిటల్ మాధ్యమంలో కూడా మెరుస్తోంది. ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం `సామ్ జామ్` పేరుతో ఓ స్పెషల్ టాక్ షోను నిర్వహిస్తోంది.


ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరీర్ గురించి సమంత స్పందించింది. `నిజంగా నాకు అదృష్టం ఎక్కువనే చెప్పాలి. పెళ్లి తర్వాత కూడా నేను వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నా. పెళ్లి తర్వాత నాకు అవకాశాలు వస్తాయనుకోలేదు. అందుకు సిద్ధపడే పెళ్లి చేసుకున్నా. పెళ్లి అనేది కెరీర్‌కు అడ్డంకి కాదని నిరూపించాలనో, పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోవాలనో నేనేం ప్లాన్ చేయలేదు. అదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది. పెళ్లి తర్వాత `రంగస్థలం` వంటి పెద్ద హిట్ వచ్చింది. ఆ తర్వాత `మహానటి`, `ఓ బేబీ` వచ్చాయి. ఇంకా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయ`ని సమంత చెప్పింది. 

Updated Date - 2020-12-15T15:04:40+05:30 IST

Read more