ఒక్క ఎపిసోడ్ చూడలేదట.. అయినా అదరగొట్టింది!

ABN , First Publish Date - 2020-10-30T16:54:38+05:30 IST

`కింగ్` నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన కోడలు పిల్ల సమంత గత వారం `బిగ్‌బాస్` వీకెండ్ కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది

ఒక్క ఎపిసోడ్ చూడలేదట.. అయినా అదరగొట్టింది!

`కింగ్` నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన కోడలు పిల్ల సమంత గత వారం `బిగ్‌బాస్` వీకెండ్ కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. దసరా రోజున ప్రత్యేక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ కార్యక్రమంలో సమంత హోస్టింగ్ ఆకట్టుకుంది. ప్రశంసలు వచ్చాయి. దీనిపై సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. 


`ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అనుభవం. `బిగ్‌బాస్` కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మా మామగారి వల్లే ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వచ్చా. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు నేను ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా వ్యవహరించలేదు. తెలుగు పెద్దగా రాదు. ఇంతకు ముందు బిగ్‌బాస్‌కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నా మీద నమ్మకముంచి నన్ను పోత్సహించినందుకు ధన్యవాదాలు మామ. ఆ ఎపిసోడ్ తర్వాత నాపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాల`ని సమంత పేర్కొంది. Updated Date - 2020-10-30T16:54:38+05:30 IST