సమంత ప్రశంస.. తమన్నా స్పందన!

ABN , First Publish Date - 2020-03-04T19:59:34+05:30 IST

వెండితెరకు పరిచయమై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నాకు మరో హీరోయిన్ సమంత

సమంత ప్రశంస.. తమన్నా స్పందన!

వెండితెరకు పరిచయమై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నాకు మరో హీరోయిన్ సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసింది. ఓ బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన తమన్నా బుధవారంతో 15 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమన్నా కోసం సమంత ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. కామన్ డీపీని కూడా అభిమానులతో పంచుకుంది. 


`15 అద్భుతమైన సంవత్సరాలు.. అందం, కష్టించేతత్వం, నిజాయితీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో తమన్నా ఒకరు. స్క్రీన్‌పై ఆమె ఓ టపాకాయ్. ఆమె నుంచి మీ చూపును తిప్పుకోలేరు. కంగ్రాట్స్ డార్లింగ్` అంటూ సమంత ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు తమన్నా స్పందిస్తూ.. `సమంత.. ప్రతి పనిలోనూ నువ్వే నాకు స్ఫూర్తి. పాత్రలను నువ్వు ఎంచుకునే విధానం, వాటిని తెరపై పోషించే తీరు నాకెంతో స్ఫూర్తిని కలిగిస్తాయి` అంటూ రిప్లై ఇచ్చింది. 

Updated Date - 2020-03-04T19:59:34+05:30 IST

Read more