సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సాలూరి వారి సంగీతం.. తెలుగు వారందరిదీ

ABN, First Publish Date - 2020-10-11T03:53:17+05:30

తన స్వరకల్పనతో తెలుగువారిని విశేషంగా అలరించిన సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. అక్టోబర్ 11న సాలూరి రాజేశ్వరరావు జయంతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన స్వరకల్పనతో తెలుగువారిని విశేషంగా అలరించిన సంగీత  దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. అక్టోబర్ 11న సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన స్వరకల్పనలోని మధురామృతాన్ని మననం చేసుకుందాం. బృందావనం అందరిదీ అయినట్టు, అందులోని గోవిందుడు అందరివాడే అయినట్టు సాలూరి రాజేశ్వరరావు సంగీతం తెలుగు వారందరిదీ. ఇక ఆ మధురామృతం తరతరాలు మననం చేసుకుంటూనే ఉన్నాయి. ఆ మననంలో మన మనస్సులో మల్లెల మాలలు ఊగుతున్నాయి.


నిజమే... సాలూరి వారి సంగీతం వింటే ఎవరి మనసుననైనా మల్లెల మాలలు ఊగ వలసిందే. చిత్రకథకు అనువుగా ఆయన పేర్చే బాణీలు వీనులకు విందు చేస్తూ తరతరాలకూ తరగని మధురామృతాన్ని మన సొంతం చేశాయి. సాలూరి వారి సంగీతం ఈ తరం వారిని సైతం పులకింప చేస్తూనే ఉంది. ఆయన పాటలను ఎంతోమంది నవతరం సంగీత దర్శకులు రీమిక్స్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ఆయన పంచిన మధురామృతం ఈ నాటికీ సంగీతాభిమానులకు సంతోషం పంచుతూనే ఉంది. భావి సంగీతకళాకారులు ఆయన పాటలతోనే సాధన చేస్తూ సాగుతున్నారు.



Updated Date - 2020-10-11T03:53:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!