సల్మాన్‌ సమర్పించు... ‘ఫ్రెష్‌’ శానిటైజర్లు!

ABN , First Publish Date - 2020-05-26T04:25:07+05:30 IST

ప్రతి ఏడాది రంజాన్‌కి తన కొత్త చిత్రాన్ని విడుదల చేయడం హిందీ హీరో సల్మాన్‌ ఖాన్‌కి అలవాటు. కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా ఈ ఏడాది చిత్రాన్ని విడుదల చేయడం కుదరలేదు...

సల్మాన్‌ సమర్పించు... ‘ఫ్రెష్‌’ శానిటైజర్లు!

ప్రతి ఏడాది రంజాన్‌కి తన కొత్త చిత్రాన్ని విడుదల చేయడం హిందీ హీరో సల్మాన్‌ ఖాన్‌కి అలవాటు. కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా ఈ ఏడాది చిత్రాన్ని విడుదల చేయడం కుదరలేదు. అయితే, మార్కెట్‌లోకి శానిటైజర్లు విడుదల చేశారు సల్మాన్‌. ‘ఫ్రెష్‌’ (జటటజి) పేరుతో సొంతంగా వ్యక్తిగత శుభ్రత, సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ ప్రారంభించిన ఆయన, తొలుత శానిటైజర్లు అందుబాటులోకి తెచ్చారు. ‘‘మొదట డియోడ్రెంట్లు మార్కెట్‌లోకి తీసుకురావాలని, తయారు చేయాలని అనుకున్నాం. కానీ, ప్రస్తుతం శానిటైజర్లు అవసరం కనుక, ముందుగా ఇవి తయారు చేశాం. కొన్ని రోజుల తర్వాత డియోడ్రెంట్లు, పర్‌ఫ్యూమ్స్‌ కూడా తీసుకొస్తాం’’ అని సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.


Updated Date - 2020-05-26T04:25:07+05:30 IST