సాక్షి అగర్వాల్‌ కొత్త చిత్రం

ABN , First Publish Date - 2020-10-18T15:43:58+05:30 IST

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించనున్న తాజా తమిళ చిత్రంలో సాక్షి అగర్వాల్‌ నటించనున్నారు.

సాక్షి అగర్వాల్‌ కొత్త చిత్రం

'కాలా, విశ్వాసం' చిత్రాలలో నటించిన అందాల భామ సాక్షి అగర్వాల్‌ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని సాక్షి అగర్వాల్‌ మరింత  కీర్తిని గడించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించనున్న తాజా తమిళ చిత్రంలో సాక్షి అగర్వాల్‌ నటించనున్నారు. తమిళ సినీ దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌, సముద్రఖనితో కథా చర్చలలో పాల్గొన్న ఫొటోను సాక్షి అగర్వాల్‌ తన ట్విట్టర్‌ పేజీలో విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడవుతాయని ఆమె పేర్కొన్నారు.


Updated Date - 2020-10-18T15:43:58+05:30 IST