హాలీవుడ్‌ చిత్రంలో సాక్షి అగర్వాల్‌

ABN , First Publish Date - 2020-11-14T21:31:09+05:30 IST

‘కాలా’ ‘విశ్వాసం’ తదితర చిత్రాలల్లో నటించి బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అందాల భామ సాక్షి అగర్వాల్‌ ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది.

హాలీవుడ్‌ చిత్రంలో సాక్షి అగర్వాల్‌

‘కాలా’ ‘విశ్వాసం’ తదితర చిత్రాలల్లో నటించి బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అందాల భామ సాక్షి అగర్వాల్‌ ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ‘వల్లదేశం’ చిత్ర దర్శకుడు ఎన్టీ నందా ప్రస్తుతం ‘120 అవర్స్‌’ అనే ఓ హాలీవుడ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి అగర్వాల్‌ హీరోయిన్‌గా, ప్రణయ్‌ కాళియప్పన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజా విడుదల చేశారు. ట్రైలర్‌ అద్భుతంగా ఉందంటూ భారతిరాజా సినీ యూనిట్‌ సభ్యులందరినీ ప్రశంసించారని దర్శకుడు ఎన్టీ నందా తెలిపారు.


Updated Date - 2020-11-14T21:31:09+05:30 IST