ఏది ఉత్తమం: సాయితేజ్ ఆసక్తికర ప్రశ్న

ABN , First Publish Date - 2020-12-08T03:12:07+05:30 IST

`చిత్రలహరి`, `ప్రతిరోజూ పండగే` వంటి సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు మెగా హీరో సాయితేజ్.

ఏది ఉత్తమం: సాయితేజ్ ఆసక్తికర ప్రశ్న

`చిత్రలహరి`, `ప్రతిరోజూ పండగే` వంటి సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు మెగా హీరో సాయితేజ్. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన `సోలో బ్రతుకే సో బెటరు` చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సాయితేజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సింగిల్ లైఫ్ గురించి పోస్టులు పెడుతున్నాడు. 


తాజాగా సాయితేజ్ ట్విటర్ ద్వారా తన అభిమానులను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. `బ్యాచిలర్ జీవితం బాగుంటుందా? వైవాహిక జీవితం బాగుంటుందా?` అని ప్రశ్నించాడు. సింగిల్‌గా ఉంటే క్రికెట్ చూడొచ్చని, పెళ్లి చేసుకుంటే సీరియల్స్ చూడాల్సి ఉంటుందంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న `సోలో బ్రతుకే సో బెటరు` సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఓటీటీ ద్వారా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-12-08T03:12:07+05:30 IST