పెళ్లి చేసుకోవాల్సిందే: సాయితేజ్

ABN , First Publish Date - 2020-05-04T18:23:59+05:30 IST

ఎప్పుడూ బిజీగా ఉండే సినిమా జనాలకు లాక్‌డౌన్ కాస్తంత విశ్రాంతినిచ్చింది.

పెళ్లి చేసుకోవాల్సిందే: సాయితేజ్

ఎప్పుడూ బిజీగా ఉండే సినిమా జనాలకు లాక్‌డౌన్ కాస్తంత విశ్రాంతినిచ్చింది. ఇళ్లలోనే ఉండేలా చేసింది. అయితే మెగా హీరో సాయితేజ్‌కు ఈ లాక్‌డౌన్ బోర్‌గా ఉందట. స్కూల్ డేస్ తర్వాత నెలన్నరపాటు ఖాళీగా ఎప్పుడూ లేనని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పదని సాయితేజ్‌ చెప్పాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివాహం గురించి సాయితేజ్ మాట్లాడాడు. 


`పెళ్లి చేసుకోమని ఇంట్లో తెగ గొడవ చేస్తున్నారు. 33 సంవత్సరాలు వచ్చేశాయి. పెళ్లి చేసుకోవాల్సిందే. వద్దని పారిపోవడం కష్టం. ఈ ఏడాదే నా పెళ్లి ఉండొచ్చేమో. నా సంగతెలా ఉన్నా.. ఇంట్లో వాళ్లు అదే పని మీద ఉంటారు. అదృష్టం కలిసొచ్చి ఈ ఏడాది ప్రేమలో పడతానేమోన`ని సాయితేజ్ చెప్పాడు. సాయితేజ్ నటించిన `సోలో బతుకే సో బెటరు` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

Updated Date - 2020-05-04T18:23:59+05:30 IST