మానవ జాతిపై ఆశ సన్నగిల్లుతోంది: సాయిపల్లవి ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-03T23:09:39+05:30 IST

తమిళనాడులో మరో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మృగాళ్లు పైశాచికంగా

మానవ జాతిపై ఆశ సన్నగిల్లుతోంది: సాయిపల్లవి ఆగ్రహం

తమిళనాడులో మరో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మృగాళ్లు పైశాచికంగా దాడి చేసి చంపేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం తప్పిపోయిన బాలిక అత్యాచారానికి, హత్యకు గురైంది. ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రిటీలు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ సాయి పల్లవి ఈ ఘటనపై భావోద్వేగ ట్వీట్లు చేసింది. 


`రోజురోజుకూ మానవజాతిపై ఆశ సన్నగిల్లుతోంది. మన శక్తిని బలహీనులను బాధపెట్టడానికి ఉపయోగిస్తున్నాము. రాక్షసానందాన్ని పొందడం కోసం చిన్నారులను బలి తీసుకుంటున్నాము. మానవ మనుగడను ప్రక్షాళన చేయాల్సిన అవసరం గురించి ప్రకృతి మనకు ప్రతిరోజూ చెబుతోంది. ఈ ఘోరమైన అన్యాయాలు చూడటానికే మనం ఇంత దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఇలాంటి రాక్షస లోకంలోకి మరో బిడ్డను తీసుకు వచ్చే అర్హత కోల్పోయామ`ని సాయిపల్లవి వరుస ట్వీట్లు చేసింది. Updated Date - 2020-07-03T23:09:39+05:30 IST