ఈ మొక్కకి అంటుకట్టి ఆశీర్వదించిందెవరంటే: సాయిమాధవ్‌ బుర్రా

ABN , First Publish Date - 2020-10-30T00:08:32+05:30 IST

ఆయన కలం పట్టి రాయడం మొదలెడితే.. అక్షరాలు కూడా ఆయుధాలుగా మారుతాయి. ఆయన రాసిన మాటలు చాలు.. యుద్ధాన్ని గెలవడానికి. విజయం

ఈ మొక్కకి అంటుకట్టి ఆశీర్వదించిందెవరంటే: సాయిమాధవ్‌ బుర్రా

ఆయన కలం పట్టి రాయడం మొదలెడితే.. అక్షరాలు కూడా ఆయుధాలుగా మారుతాయి. ఆయన రాసిన మాటలు చాలు.. యుద్ధాన్ని గెలవడానికి. విజయం సాధించడానికి. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా? మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ రైటర్‌గా పేరు తెచ్చుకున్న సాయిమాధవ్‌ బుర్రా.. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి మాటలు రాస్తున్నారు. అయితే ఆయన ఈ స్థానానికి రావడానికి కారణమైన వారిని మాత్రం ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు. తాజాగా తన ఉన్నతికి కారణమైన మరొకరి పేరు చెబుతూ.. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సాయిమాధవ్‌ బుర్రా.


''సినిమా అనే ఈ రంగుల భూమిలో సాయిమాధవనే ఈ చిన్నిమొక్కని నాటి నీరుపోసింది క్రిష్ గారయితే.. ఈమొక్కకి అంటుకట్టి ఆశీర్వదించింది నాగబాబుగారు. సార్ నాగబాబుగారూ.. మీరిదే ఉత్సాహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వందకి పైగా పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.." అని సాయిమాధవ్‌ బుర్రా ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Updated Date - 2020-10-30T00:08:32+05:30 IST