సైఫ్‌ తనయుడి సినీ అరంగేట్రం

ABN , First Publish Date - 2020-11-06T09:57:47+05:30 IST

బాలీవుడ్‌లో మరో నట వారసుడు అరంగేట్రం చేయనున్నాడు. సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ సినీ అరంగేట్రం చేయబోతున్నాడు...

సైఫ్‌ తనయుడి సినీ అరంగేట్రం

బాలీవుడ్‌లో మరో నట వారసుడు అరంగేట్రం చేయనున్నాడు. సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ సినీ అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సైఫ్‌ స్వయంగా ప్రకటించారు. తనయుడి సినీ ప్రవేశం గురించి మాట్లాడుతూ ‘‘ఇబ్రహీం చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి అడుగుపెడతాడు. సినిమాల్లో నటించాలనుకుంటే ఇప్పటినుంచే సిద్ధమవ్వాలని అతనికి చెప్పాను. నా పిల్లలందరినీ సినీ పరిశ్రమలోకి తీసుకొస్తాను. పనిచేసేందుకు సినీరంగం మంచి ప్లేస్‌. 18 ఏళ్ల వయసులో నా జీవితం అంతా గందరగోళంగా ఉండేది. నటన నా కెరీర్‌ పాడవకుండా ఆపింది. గుర్తింపు ఇచ్చింది. అందుకే నా పిల్లలను సినీరంగంలోకి తీసుకురావాలనుకుంటున్నాను’’ అని సైఫ్‌ చెప్పుకొచ్చారు. ఇటీవల ఇబ్రహీం ఒక మేగజైన్‌ కవర్‌పైన కనిపించారు. అలాగే సోదరి సారాతో కలసి దుస్తుల బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం జరిపిన ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. సారా అలీఖాన్‌ ఇప్పటికే పలు బాలీవుడ్‌ చిత్రాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Updated Date - 2020-11-06T09:57:47+05:30 IST