ఆటో బ‌యోగ్ర‌ఫీ రాస్తున్న బాలీవుడ్ స్టార్‌

ABN , First Publish Date - 2020-08-25T19:00:33+05:30 IST

సైఫ్ ఆలీఖాన్ రైట‌ర్‌గా మారి త‌న ఆటో బ‌యోగ్ర‌ఫీ రాస్తున్నారు.

ఆటో బ‌యోగ్ర‌ఫీ రాస్తున్న బాలీవుడ్ స్టార్‌

బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న రైట‌ర్‌గా మారాట‌. అంటే సైఫ్ సినిమా క‌థ రాస్తున్నార‌ని భావించొద్దు. ఆయ‌న రైట‌ర్‌గా మారి త‌న ఆటో బ‌యోగ్ర‌ఫీ రాస్తున్నారు. ఈ ఆటో బ‌యోగ్ర‌ఫీలో త‌న ఇల్లు, కుటుంబం, జ‌యాప‌జ‌యాలు, త‌న‌కు స్ఫూర్తినిచ్చిన విష‌యాలు, సినిమాలు ఇలా అన్నీ విష‌యాల గురించి వివ‌రిస్తార‌ట‌. హార్ప‌ర్ కొలిన్స్ ఇండియా ఈ ఆటో బ‌యోగ్ర‌ఫీని ప్రింట్ చేయనుంద‌ట‌. 2021లో సైఫ్ ఆటో బ‌యోగ్ర‌ఫీ విడుద‌ల‌వుతుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే.. బంటీ ఔర్ బ‌బ్లీ 2, భూత్ పోలీస్ అనే చిత్రాల్లో న‌టిస్తున్నారు సైఫ్ ఆలీఖాన్‌. 

Updated Date - 2020-08-25T19:00:33+05:30 IST