‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ నేను కాదంటోంది

ABN , First Publish Date - 2020-06-16T02:37:41+05:30 IST

‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఎప్పుడెప్పుడా అని

‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ నేను కాదంటోంది

‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు మహేష్ డబుల్ ట్రీట్ అన్నట్లుగా టైటిల్‌తో పాటు ప్రీలుక్‌ను కూడా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున విడుదల చేశారు. ఈ టైటిల్‌కు, ప్రీలుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఇప్పుడు అనేకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటిస్తున్నారంటూ ఇప్పటికే ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ‘దబాంగ్ 2’ ఫేమ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్త నిజమేనా అని సాయి మంజ్రేకర్‌ని అడిగితే ఏం సమాధానం చెప్పిందో తెలుసా?


‘‘మహేష్ బాబు సినిమాలో నేను హీరోయిన్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంత వరకు నాకు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు. ఒకవేళ ఆఫర్ వస్తే మాత్రం ఇప్పట్లో నేను ఏమీ చెప్పలేను. ఆ టైమ్‌కి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూసి అప్పుడు మాత్రమే నా నిర్ణయం చెబుతాను. నేను హీరోయిన్‌గా చేస్తున్నాను అనే వార్తలు రావడానికి కారణం.. నమ్రతా శిరోద్కర్ మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ కాబట్టే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేసి ఉంటారు. ప్రస్తుతానికైతే నేను చెప్పగలిగింది ఇంతే..’’ అని సాయి మంజ్రేకర్ తెలిపింది.

Updated Date - 2020-06-16T02:37:41+05:30 IST