రానా పోస్ట్‌పై సాయితేజ్ రియాక్షన్ ఇదే

ABN , First Publish Date - 2020-05-13T00:01:24+05:30 IST

తనకు కాబోయే భార్య ఫొటోని పోస్ట్ చేసిన రానా, ఆమె ఒప్పుకుంది అంటూ తెలిపారు. టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన రానా ఓ ఇంటివాడు కాబోతున్న విషయాన్ని

రానా పోస్ట్‌పై సాయితేజ్ రియాక్షన్ ఇదే

తనకు కాబోయే భార్య ఫొటోని పోస్ట్ చేసిన రానా, ఆమె ఒప్పుకుంది అంటూ తెలిపారు. టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన రానా ఓ ఇంటివాడు కాబోతున్న విషయాన్ని ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న హీరోలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లి అయిన హీరోలందరూ రానాకు శుభాకాంక్షలు తెలుపుతుంటే.. పెళ్లికాని హీరోలు మాత్రం రానాని తిట్టుకుంటున్నారు. ఎందుకంటే.. ఇంత సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చాడేంటి అని అంతా ఇప్పుడు రానా పోస్ట్‌కి కామెంట్ కామెంట్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ మెగా హీరో సాయితేజ్ చేసిన పోస్టే. 


ఇంతకీ సాయితేజ్ ఏం పోస్ట్ చేశారో తెలుసా?..  నిద్ర మద్యలో లేచిన ఓ వీడియోని పెట్టి.. ‘‘ఇది ఒక కల.. గుడ్ నైట్ మళ్లీ పడుకుంటున్నా.. ’’ అని సాయితేజ్ పోస్ట్ చేశారు. అయితే సాయితేజ్ చేసిన పోస్ట్‌కి నెటిజన్ల కామెంట్స్ కూడా బ్యాచ్‌లర్స్ ఒకలా, పెళ్లి అయిన వారు మరోలా చేస్తుండటం విశేషం. ‘మరి మీ పెళ్లి ఎప్పుడు’ అని కొందరు.. ‘మనం సింగిల్ అయినందుకు గర్వపడదాం..’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.Updated Date - 2020-05-13T00:01:24+05:30 IST