సాయిపల్లవి ఎమోష‌న‌ల్ ట్వీట్‌

ABN , First Publish Date - 2020-04-25T13:16:37+05:30 IST

న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ మెప్పు పొందుతున్న న‌టి సాయిప‌ల్ల‌వి. ఈమె రీసెంట్‌గా కుటుంబంతో క‌లిసి ఓ సినిమా చూసి ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆ సినిమా తీసిన లేడీ డైరెక్టర్‌కు ట్వీట్ చేశారు.

సాయిపల్లవి ఎమోష‌న‌ల్ ట్వీట్‌

న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ మెప్పు పొందుతున్న న‌టి సాయిప‌ల్ల‌వి. ఈమె రీసెంట్‌గా కుటుంబంతో క‌లిసి ఓ సినిమా చూసి ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆ సినిమా తీసిన లేడీ డైరెక్టర్‌కు ట్వీట్ చేశారు. ఇంత‌కు ఆ సినిమా ఏదో తెలుసా? త‌మిళ చిత్రం ‘సిలుకువారిప‌ట్టి’. హలితా షమీం ఈ చిత్రాన్ని తెరకెక్కించగా గత ఏడాది డిసెంబర్‌లో సినిమా విడుద‌లైంది. సముద్ర‌ఖ‌ని, సునైన త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమాను చూసిన సాయిప‌ల్ల‌వి ట్వీట్ చేశారు. ‘‘ప్రియ‌మైన హ‌లితా ష‌మీం.. మీరు తీసిన సినిమాను చూసిన నేనే కాదు, నా ఫ్యామిలీ కూడా ఎమోష‌న‌ల్ అయ్యాం. మాకు మంచి అనుభూతిని క‌లిగించావు. నీకు ధ‌న్య‌వాదాలు. నువ్వు ఇలాంటి చిత్రాల‌ను మెరెన్నింటినో తీయాల‌ని కోరుకుంటూ నీకు నా ప్రేమ‌ను పంపుతున్నా’’  అన్నారు సాయిప‌ల్ల‌వి. సాయిప‌ల్ల‌వి ట్వీట్‌కు హ‌లితా ట్విట్ట‌ర్ ద్వారా బ‌దులిచ్చారు. ‘‘ఈ లాక్ డౌన్ కార‌ణంగా మాన‌సిక ఒత్తిడికి లోన‌య్యా. అయితే ఏంజెల్ సాయిప‌ల్ల‌వి ట్వీట్‌తో నా ఒత్తిడి మొత్తం పోయింది’’ అన్నారు. 

Updated Date - 2020-04-25T13:16:37+05:30 IST