సాయిపల్లవి అరుదైన ఘనత!

ABN , First Publish Date - 2020-02-08T20:43:53+05:30 IST

తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్‌తో పలు భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది తమిళ భామ సాయి పల్లవి.

సాయిపల్లవి అరుదైన ఘనత!

తన అద్భుత నటనతో, డ్యాన్స్‌తో పలు భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది తమిళ భామ సాయి పల్లవి. గ్లామరస్ పాత్రలకు దూరంగా, నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో రానాతో కలిసి `విరాటపర్వం`లోనూ, శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న `లవ్‌స్టోరీ`లోనూ నటిస్తోంది. 

తాజాగా సాయి పల్లవికి అరుదైన ఘనత దక్కింది. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ తాజాగా `ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30` జాబితాను విడుదల చేసింది. 30 సంవత్సరాలలోపు తమ తమ రంగాల్లో విజయాలను సాధించిన 30 వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు దక్కించుకుంది. దీంతో సాయిపల్లవి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.


Updated Date - 2020-02-08T20:43:53+05:30 IST